దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,000లకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,42,497 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,151 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. గత ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,903కు చేరుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa