ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై తాను చేసిన అవినీతి ఆరోపణలు ముమ్మాటికీ నిజమని, ఆయన అవినీతిని నిరూపిస్తామని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. అనంతపురం నగరంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..... కేతిరెడ్డిపై నిమ్మల కిష్టప్పతో కలసి తాను చేసిన ఆరోపణల్లో నిజం ఉందని అన్నారు. తాము చేసిన ఆరోపణల కంటే 50 రెట్లు అధికంగానే కేతిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాము చేసిన ఆరోపణలను కోర్టులో నిరూపిస్తామని అన్నారు. కేతిరెడ్డి దౌర్జన్యాలు, అక్రమాలు, దోపిడీలు చేసింది వాస్తవమేనని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa