వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల జాబితాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన పురుగుమందులు, ఎరువులు ఆర్బీకే ద్వారా అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.