ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలిగొన్న సంఘటన మండల పరిధిలోని పేరేచర్ల 6వ మైలు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన షేక్ ముసుబ్(23) పేరేచర్ల లో ఏసీ రిపేరు చేసుకుని తిరుగు పయనమై బ్రాహ్మణపల్లి వెళుచుండగా మధ్యలో పేరేచర్ల 6మైలు కైలాసగిరి సమీపంలో డస్ట్ లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఎదురుగా వెళ్తున్న ముసుబు ద్విచక్రవాహాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ముసుబు కింద పడిపోగా ట్రాక్టర్ ముసుబ్ ఒంటిపై నుండి వెళ్లిపోయినది. తీవ్ర గాయాలు పాలైన ముసుబ్బును మేడికొండూరు ఎస్సై కే. కోటేశ్వరరావు 108అంబులెన్స్ సహాయంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముసుబు మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.