భీమడోలు వద్ద దురంతో ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరగడంతో విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చే రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయని వాల్తేరు అదికారులు గురువారం ఒక ప్రకటన ద్వార తెలియజేసారు. ఈమేరకు దురంతో ఎక్స్‌ప్రెస్ లొకేషన్‌ను దాటుతుండగా ఎల్ సి గేట్‌ను ఢీకొట్టిన తర్వాత ఒక టాటా ఏస్ ట్రాక్‌పైకి వచ్చింది. దింతో టాటా ఏస్ రైలు ఢీకొని లోకో జామ్ అయ్యిందని వెళ్లడించారు. ఉదయం 5 గంటలకు ట్రాక్ క్లియర్ చేయబడిందని అనంతరం రైలు సర్వీసులు ప్రారంభమమైయ్యాయని తెలిపారు.