శాంతిభద్రతల పరిరక్షణలో చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని కర్నూలు రేంజ్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కు మార్ తెలిపారు. బుధవారం చిత్తూరులోని హోంగార్డు యూనిట్లను పరిశీలించారు. అనంతరం దర్భార్ పరేడ్ నిర్వహించి హోంగార్డుల గౌరవవందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్బీమా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మెడికల్ క్యాంపులో అందరూ భాగస్వామం కావాలని సూచించారు. వేసవి నేపథ్యంలో ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీలు మురళీధర్, కృష్ణమోహన్, లక్ష్మణ్ కుమార్, ఆ నీలకంఠేశ్వరరెడ్డి పాల్గొన్నారు.