ఆవ నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చూస్తుంది. గుండె జబ్బులు మొదలు వివిధ రకాల సమస్యలను ఆవనూనె దూరం చేస్తుంది. ఆవ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది జలుబు, దగ్గు నివారణకు ఉపయోగపడుతుంది. ఆవ నూనెకి ఎర్ర రక్త కణాలని బలపరిచే శక్తి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. అలాగే ఆవ నూనె మధుమేహాన్ని అడ్డుకుంటుంది.