నేడు ఆదివాసీ సంఘాలు మన్యం బంద్ కు పిలుపునిచ్చాయి. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నేడు బంద్ కు పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని మన్యం ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఈ బంద్ కు వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.