రాజీవ్ స్వగృహ ను ఆదర్శ టౌన్ షిప్ గా తీర్చిదిద్దుతామని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహలో రూ 3. 81 కోట్ల అంచనా నిధులుతో సీసీ రోడ్లు, మౌలిక వసతుల నిర్మాణాలకు జరిగిన భూమిపూజలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. నాలుగునెలల వ్యవధిలో ఈ పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులును ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి రాజీవ్ స్వగృహలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులుతోనూ, గృహ యజమానులుతోనూ కూలంకుశంగా చర్చించారు. సుమారు 4 కోట్ల నిధులుతో పార్క్, పాత రోడ్డురెన్యువల్, సుందరీకరణ పనులను కూడా చేపడతామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
యాభై ఏడు ఏకరాలలోవున్న లే అవుట్ ను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 147 ప్లాట్లు, పాతవి 7 ప్లాట్లను వేలం వేయాల్సిఉందన్నారు.
అటు జిల్లా కలెక్టరేట్, ఇటు ఎస్ పి కార్యాలయం మధ్యలో రాజీవ్ స్వగృహ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చెందుతుండడంపై రాజీవ్ స్వగృహ ఆనంద నిలయం గృహ యాజమానుల హర్షం వ్యక్తం చేశారు.