జిల్లాలో రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల జవాబు మూల్యాంకనానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆర్ఎస్ఐఓ ఎస్. తవిటినాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిబ్బంది నియామకం పూర్తయ్యిందని, సెల్ఫోన్లకు అనుమతి లేదని తెలిపారు. సీసీ కెమెరాలను అమర్చి, స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దిద్దుబాటులో అలసత్వం ప్రదర్శించి, తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.