భార్యను వేధిస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడ్ని హత్య చేసిన ఘటన అహ్మదాబాద్ లో జరిగింది. బాపునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహ్మద్ మీరజ్, మహ్మద్ ఇమ్రాన్ స్నేహితులు. కాగా, మీరజ్ ఇమ్రాన్ భార్యను తరచూ వేధించేవాడు. దీంతో దంపతులిద్దరూ మీరజ్ ను ఇంటికి పిలిచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామంటూ కళ్లకు గంతలు కట్టి, కత్తితో పొడిచి చంపారు. మీరజ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.