పులివెందుల పట్టణ పరిధిలోని పెద్దరంగాపురం గ్రామంలో గురువారం పార్వేట ఉత్సవాన్ని గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి పండుగకు ముందు రోజు కొంత మంది యువకులు అడవికి వెళ్లి కుందేళ్లను పట్టుకొస్తారు. సాయంత్రం వేళ గ్రామ శివార్లలోని ఓ పొలంలోకి తీసుకెళ్లి వాటిని వదలుతారు. అవి పరుగెడుతుంటే వాటిని వెంటాడి పట్టుకోవడం ఈ పార్వేట ఉత్సవంలో సరదా తెప్పిస్తుంది. కుందేళ్లను పట్టుకోవడానికి యువకులు ఎంత ప్రయత్నం చేసినా అవి దొరకలేదు. వేట అనంతరం జీవించే హక్కు ప్రతి జీవికి ఉందన్న వన్యమృగ చట్టం ప్రకారం వాటి బతుకుదెరువు కోసం తిరిగి వాటిని అడవిలోకి వదలారు. ఈ పార్వేట ఉత్సవానికి ముఖ్య అతిధిలుగా గోవిందరాజ టెక్సైల్స్ జిఎం శివకుమార్, సుబ్రహ్మణ్యంలు హాజరయ్యారు. కార్యక్రమంలో యువకులు, యువతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa