శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇందుకు 70 మంది సిట్టింగ్ స్క్వాడ్ లను, 8 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఇందుకు 4 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు డిఈఓ పగడాలమ్మ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa