అమరావతి రైతుల ఉద్యమానికి బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు విష్టుకుమార్ రాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... అమరావతి రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంచించారని...దారుణంగా మోసం చేశారని విమర్శించారు. రైతులపై పెట్టిన కేసులు బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ జగన్ గెలిస్తే.. రాష్ట్రం ఎడారి అవుతుందన్నారు. వైసీపీ నేతలు విశాఖలో విలువైన ఆస్తులు దోచుకోవడానికే పరిపాలన రాజధాని అంటున్నారని ఆరోపించారు. అమరావతే రాష్ట్రానికి ఎకైక రాజధాని అని.. ఇదే బీజేపీ విధానమని, మూడు రాజధానులకు బీజేపీ మద్దతులేదని విష్టుకుమార్ రాజు స్పష్టం చేశారు.