ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. 1,168 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు అంగీకరించారు. 34 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా, 146 మందికి ఆర్టీసీ కానిస్టేబుళ్లుగా, 175 మందికి కండక్టర్లుగా, 368 మందికి డ్రైవర్లుగా, 445 మందికి అసిస్టెంట్ మెకానిక్ లుగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.