కర్ణాటక రాష్ట్రం ఎత్తిన హోళే ప్రాజెక్టు నుంచి పావగడకు ఏర్పాటు చేస్తున్న పైపులైను కోసం మడకశిర మండలంలో భూములు కోల్పోయిన రైతులకు శుక్రవారం సబ్ కలెక్టర్ కార్తీక్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. మండల పరిధిలోని పాపసానిపల్లి, కదిరేపల్లి, గుర్రపుకొండ తదితర గ్రామాల్లోని 90మంది రైతులకు పరిహారం మంజూ రైనట్లు తహసీల్దార్ బాలాంజనేయులు తెలిపారు. వారిలో 75 మందికి రూ. 1. 41 కోట్లు పంపిణీ చేశామన్నారు. మిగిలిన రైతులు బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్నారని వారికి త్వరలోనే అందజేస్తామన్నారు.