విశాఖపట్నంలోని ఆదాని పోర్టులో కార్మికులు నిరసనకు దిగారు. తమకు వేతనాలు పెంచాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కార్మికులు ఒంటిపై డీజిల్ పోసుకొని నిరసన తెలియజేశారు. తమకు 2009లో రూ.4,732 చొప్పున జీతాలు ఇవ్వగా, ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి రూ.8,300 నుండి 14,600 మాత్రమే జీతాలు ఇస్తున్నారని తెలిపారు. కార్మికులందరికీ రూ.36,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa