ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే చుక్కల భూముల పత్రాలు పంపిణీ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. అభ్యంతరాలు లేని భూములను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. దీనిద్వారా నెల్లూరు జిల్లాలోనే 40 వేల ఎకరాల మేర రైతులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే జిల్లాలో పర్యటించి రైతులకు పత్రాలు అందిస్తారని తెలిపారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.