ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం మైసన్న గూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు జంగారెడ్డిగూడెం ఆస్పత్రి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారు తోణం శివ(35), భార్య చిన్ని (30), కుమారుడు మంగరాజు(9), శివ సోదరుడు నాగ వెంకట దుర్గారావు(39)గా పోలీసులు గుర్తించారు.