టీడీపీ హయాంలో కాపుల సంక్షేమానికి రూ.3,100కోట్లు ఖర్చు చేశామని నారా లోకేశ్ అన్నారు. జగన్ వచ్చాక కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని, కాపులకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే కృష్ణదేవరాయల జయంతి, వర్ధంతిని అధికారంగా నిర్వహిస్తామన్నారు. రజకుల సంక్షేమానికి నిధులు ఇస్తామని, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. రూ.5వేల కోట్లు సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారని, స్వర్ణకారులను సైతం ఈ ప్రభుత్వం లంచాల కోసం వేధిస్తోందని లోకేశ్ ఆరోపించారు.