విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరండి... జగన్ కు జేడీ లక్ష్మీనారాయణ విన్నపం
విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే కుట్రలు ఆపాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్రానికి ఆయన లేఖ రాశారు. దీనిపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కేటీఆర్ స్పందన హర్షణీయం అని తెలిపారు. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గకుంటే... ముడిసరుకు సరఫరా, వర్కింగ్ క్యాపిటల్ ను అందించే బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొనాలని లక్ష్మీనారాయణ సూచించారు. కేటీఆర్ తరహాలో వైఎస్ జగన్ కూడా ఇదే వైఖరి తీసుకోవాలని ప్రార్థన అంటూ ట్వీట్ చేశారు