త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు తన పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి కర్తవ్య బోధ చేయనున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొననున్నారు. గడప గడపకు కార్యక్రమంలో అందిన వినతుల పరిష్కారం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక, జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమంపైనా సీఎం జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.