జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. పుత్తూరు పట్టణం ఎన్జీవో కాలనీలో వారం రోజుల క్రితం ఓ ఇంటి మీద సెల్ టవర్ నిర్మాణాన్ని ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభించింది. కాలనీవాసులు టవర్ నిర్మాణాన్ని అడ్డుకొని మున్సిపల్ రెవిన్యూ అధికారులు వినతిపత్రం అందజేశారు. టవర్ నుంచి వెలివేడే రేడియేషన్ వల్ల చర్మవ్యాధులు ఇతర రోగాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో చెట్ల కింద నివసించే పక్షులు నశించిపోయే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు.