ప్రముఖ పర్యట కేంద్రమైన అరకులోయ పట్టణ పరిసర ప్రాంతంలో సోమవారం ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు దట్టంగా పొగ మంచు కమ్మేసింది. దీనితో ఇల్లు చెట్టు రోడ్లు ఎదురుగా వచ్చే మనుషులు వాహనాలు కనిపించా లేనంతగా మంచు కురిసింది. దీనితో వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ఉద్యోగులు మంచు కారణంగా ఇబ్బందులు పడుతూ తమ తమ పనులకు వెళ్ళవలసి వచ్చింది. కొద్ది గంటల తర్వాత భానుడి లేలేత కిరణాలకు మంచు తెరలు క్రమంగా కనుమరుగయ్యాయి.