కడప నగరం సిద్దార్ధ ఇంగ్లీషు మీడియం స్కూలు లో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా వచ్చిన ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.... విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి పాఠశాలకు, తల్లిందండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సిద్దార్థ ఇంగ్లీషు మీడియం స్కూలుతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని, పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మయ్య ఎంతో కృషి చేసి పాఠశాలను ఈ స్థాయికి తీసుకువచ్చారన్నారు. కరస్పాండెంట్ లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి రావడం సంతోషకరంగా ఉందన్నారు.