అమరావతిలో పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం జియో నంబర్ 45ను తీసుకొచ్చింది.ఈ నేపథ్యంలో రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించారు. అమరావతి రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సీఆర్డీఏ పరిధిలోని 1,130 ఎకరాల భూమిని ఇంటి స్థలాల కింద కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.