గుంతకల్లు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పను లకు నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి ముత్యాల నాయుడు ను నియోజక వర్గం ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి కోరారు. సోమ వారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో వైవిఆర్ కలిశారు. గ్రామాలలో ఇప్పటికే చేసిన పనులకు పెండింగ్ బిల్లులు మంజూరు చేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహక రించాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే వైవిఆర్ తెలిపారు. ఎమ్మెల్యే తోపాటు ఆయన సోదరుడు ఆదోని ఎమ్మెల్యే సాయిప్రతాప్ రెడ్డి కూడా మంత్రిని కలిసి తమ నియోజక వర్గం సమస్యలు మంత్రికి వివరించారు. అనంతరం జిల్లా ఇంచర్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ని కలిసి నియోజక వర్గాల సమస్యలు వివరించారు.