హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో సోమవారం రాత్రి ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ పర్యటించారు. ఈ సందర్భంగా నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకుని వస్తే తన వంతు కృషిచేసి పరిష్కరిస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదాశివారెడ్డి, ఫారూక్, చౌడప్ప, మోదీపి లక్ష్మి నారాయణ, ఆర్మీ శివ రెడ్డి, లేపాక్షి లక్ష్మినారాయణ, నాగేంద్రరెడ్డి, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.