నిరుపేదలకు నీడ కల్పించడమే ధ్యేయంగా జగనన్న పాలన సాగుతోందని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జగనన్న కాలనీలు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన చెప్పారు. మండలంలోని సిలోను కాలనీ వాసులు 47 మందికి సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చేతులమీదుగా ఎమ్మెల్యే బలరాం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 40 సంవత్సరాలుగా ఈ కాలనీవాసులు నివేశన స్థలాల కోసం ఎదురు చూస్తుండగా ఇప్పటికి వారి కల సాకారం అయింది. వీరనే కాకుండా నియోజకవర్గం లో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించే బృహప్రణాళికను సిద్ధం చేసినట్లు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్ బాబు చెప్పారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ శివ జ్యోతి, ఆర్డీవో సరోజినీ, తాసిల్దారులు ప్రభాకర్ రావు, మహేశ్వరి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, కమిషనర్ రామచంద్రారెడ్డి, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.