తెనాలి పట్టణానికి చెందిన వైద్యుడు నందిపాటి శ్రీకాంత్ జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్లేందుకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నారు. దీనికోసం ట్రావెల్స్ ఇన్సూరెన్స్, హెలికాప్టర్ రైడ్ చేయిస్తామంటూ గుర్తు తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. వారి మాటలకు నమ్మి రూ. 33, 000 వారి ఖాతాకు శ్రీకాంత్ బదిలీ చేశారు. వారి నుండి ఎటువంటి సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సోమవారం శ్రీకాంత్ వన్ టౌన్ పోలీస్ లను ఆశ్రయించారు.