రాజుపాలెం: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వైయస్సార్ క్రాంతి పథకం, సీడాఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు కోటప్పకొండ టీటీడీసీలో నాలుగు నెలలు శిక్షణ ఇవ్వనున్నట్లు సోమవారం ఏపీఎం. బి. సునీత తెలిపారు. 19 ఏళ్లు నుండి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి, డిగ్రీ పాస్, ఫెయిల్ అయిన వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో నెలకు రూ. 15 వేల జీతం కల్పించబడునని తెలిపారు.