దొనకొండ మండలం ప్రధాన కేంద్రంగా రైల్వే స్టేషన్లో కోతుల బెడద రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే ప్రయాణికులు కోతుల దెబ్బకు భయభ్రాంతులైపోతున్నారు. గుంపులుగా చేరిఇబ్బందులు పెడుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. సంబంధింత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుకుంటున్నారు. ఒంటరిగా వచ్చిన వారి మీద పడి దాడి చేస్తున్నాయని వాపోతున్నారు.