ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసత్య కథనాలు రాయటం చాలా దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 04, 2023, 12:27 PM

రాజాం నియోజకవర్గం చరిత్రలో అవినీతి మరక, రూపాయి సంపాదన లేని నాయకుడు నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటున్న రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు మీద యెల్లో మీడియా అసత్య కథనాలు రాయడం చాలా దారుణమని రాజాం నియోజకవర్గ వైకాపా శ్రేణులు భగ్గుమంటున్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. గ్రామ స్థాయి కార్యకర్త నుండి నియోజకవర్గ స్థాయి నాయకుడు వరకు అందరిని పేరు పేరునా పిలిచే నాయకుడు మా ఎమ్మెల్యే కంబాల జొగులు అని ప్రశంసించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 10 ఏళ్ల పిల్లోడు నుండి 60 ఏళ్ల ముసలోడు వరకు ఎవరని అడిగిన జోగులన్న మనసు వ్యక్తిత్వం, చీమకి అయిన హనిచేయని మనస్తత్వం గురించి చెపుతారని అన్నారు. ఎన్ని పార్టీలు వచ్చిన ఎంత మంది నాయకులు వచ్చిన ప్రతిపక్షాల్లో ఎంత డబ్బు బలం ఉన్న నాయకుడు అయిన సరే రాజాం గడ్డ జోగులన్న అడ్డా అని అన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో 2019 కంటే ఒక్క ఓటు అయిన ఎక్కువ మెజారిటీతో కంబాల జోగులు గెలిచి తీరుతారని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa