ఆర్ 5 జోన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం ఉదయం ఆర్ 5 జోన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని వెలుపల ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 1,134 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 45పై ఈరోజు విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులపై వాదనలు వినేందుకు ఈనెల 19కి కేసు విచారణను వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa