రాష్ట్రంలోని రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారం రోజుల్లో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కనీస మద్దతు ధర లభించలేదనే ఫిర్యాదు ఏ రైతు నుండి రాకూడదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల జోక్యం, బియ్యం దారి మళ్లింపును సహించబోమని మంత్రి హెచ్చరించారు. మిల్లర్లకు అవసరమైన గోతాలను సరఫరా చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa