నాలుగో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నం జరిగిన కేసుకు సంబంధించి దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ సీహెచ్ వివేకానంద మంగళవారం కూర్మన్నపాలెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలను సందర్శించి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ వాచ్‌మన్ ఆల్లకోటి పోచన్నను పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే విద్యాసంస్థలో పిల్లల భద్రతకు సంబంధించి సరైన చర్యలు తీసుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌పై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నగరంలోని విద్యాసంస్థలు, యాజమాన్యాలు విద్యార్థినులు, మహిళల రక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ వివేకానంద ఒక ప్రకటనలో హెచ్చరించారు.