పుంగనూరు నియోజకవర్గంలో ఈనెల 20వ తేదీ నుంచి 'ఇంటింటికి మీ చల్లా' కార్యక్రమం చేపడుతున్నట్లు టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక పాలన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పుంగనూరు నుంచి ఇంటింటికి మీ చల్లా కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.