ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వేపాడ చిరంజీవిరావు నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపుకు సహకరించిన అయ్యన్నకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించాలని సూచించారు. ప్రజాసేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండాలని పేర్కొన్నారు.