ఉద్యోగం, కెరీర్ లో సమస్యలైతే కొన్ని పరిహారాలు పాటించాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూడాలని, శనివారం కాకులకు అన్నం పెడితే మంచి ఫలితాలు కలుగుతాయంటున్నారు. అలాగే, రాగి పాత్రలో నీటిని తీసుకుని బెల్లం కలిపి ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ‘ఓ గణపతయే నమః’ అనే మంత్రాన్ని పఠిస్తే కెరీర్ లో మంచి జరుగుతుందని చెబుతున్నారు.