నర్సీపట్నం నియోజకవర్గంలో గురువారం నుంచి నిర్వహించే జగనన్నే మా భవిష్యత్తు పోస్టర్ ను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం నర్సీపట్నం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. సచివాలయ కన్వీనర్లు గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్లి వారి అవసరాలను తెలుసుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుదిబండ ఆదిలక్ష్మి, వైసీపీ నాయకులు సన్యాసి పాత్రుడు పాల్గొన్నారు.