గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న లోయర్ డివిజన్ కంప్యూటర్ ఆపరేటర్లకు ఈనెల 6వ తేదీన ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ ను నిరవధికంగా వాయిదా వేస్తూ డీఎంహెచ్వో శ్రావణ బాబు బుధవారం ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.