పొన్నూరు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కిలారి రోశయ్య పార్టీ నాయకులతో కలిసి మా నమ్మకం నువ్వే జగన్ పోస్టర్ను ఆవిష్కరణ గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 7వ తారీఖు నుంచి 20వ తారీకు వరకు తలపెట్టిన "జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. తద్వారా పార్టీ బలోపేతంతో పాటు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు వైసిపి నాయకులు పాల్గొన్నారు.