గుంటూరు: బ్యాంకు ఉద్యోగి అని చెప్పుకొని యువతులను మోసం చేస్తున్న సుదర్శన్ రావు అనే నిందితుడిని బుధవారం గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు ఉద్యోగి పేరుతో ఐడి కార్డులు క్రియేట్ చేసి మ్యారేజ్ బ్యూరో వెబ్సైట్లో పెట్టి యువతులను డ్రాప్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తుండే వాడని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు దిశా పోలీస్ స్టేషన్ ద్వారా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.