హయాంలో చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఒక్క పథకం పేరు చెబితే రూ. 10 వేలు బహుమతి ఇస్తానని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చెన్నూరు పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. మండలంలోని 562 డ్వాక్రా సంఘాలకు రూ. 4. 15 కోట్లు లబ్ధి చేకూరినట్లు పేర్కొన్నారు. చింతకొమ్మదిన్నె జడ్పీటీసీ సభ్యుడు నరేన్ రామాంజులు రెడ్డి మాట్లాడుతూ మార్పును గమనించాలని ఏ ప్రభుత్వం మేలు చేసిందో గుర్తించి ఓటు వేయాలని మహిళకు సూచించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు చీర్ల సురేష్ యాదవ్, ఎంపీడీవో సురేష్, ఏపీఎం గంగాధర్, నాయకులు ముదిరెడ్డి సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.