ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటి ఆపరేషన్లు చేసుకున్న వారిని పరామర్శించిన మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 12:20 PM

రోజా చారిటబుల్ ట్రస్ట్ మరియు శంకర్ నేత్రాలయ ఆస్పత్రి చెన్నై వారి ఆధ్వర్యంలో నగరి లోని మంత్రి కార్యాలయంలో గత నాలుగు రోజులుగా సుమారు 1, 000 కి పైగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొదటి విడతగా 50 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్ చేసుకున్న వారిని మంత్రి రోజా గురువారం స్వయంగా పరామర్శించారు. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం వరకు ప్రతి రోజు 250 మందికి కంటి పరీక్షలు చేయడంతో పాటు 50మంది వరకు కంటి పోర ఆపరేషన్లు చేయనున్నారు. ఈ అవకాశాన్ని నగిరి నియోజక వర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com