R-5 జోన్ వ్యవహారంపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమరావతి రాజధానిలో భూముల్ని అన్ని ప్రాంతాలవారికి కేటాయించేందుకు వీలుగా వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 45 తీసుకొచ్చింది. దీనిపై స్ధానిక రైతులు హైకోర్టును ఆశ్రయించినా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 14న విచారణ జరుగనుంది.