రైతుల అవసరాలకు ఉపయోగపడేలా ఉపాధి హామీ పథకం పనులు చేపట్టాలని సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ సూచించారు. సోంపేట మండలంలోని బెంకిలి పంచాయతీ బలరాం సాగర్ చెరువులో ఉపాధి హామీ పథకం పనులు శుక్రవారం ప్రారంభించారు. సాగునీటి చెరువులు, సాగునీటి కాలువలు పనులు రైతులకు ఉపయోగపడే విధంగా చేపట్టాలన్నారు. వేసవి ఎండలు తీవ్రత కారణంగా పనిలోకి వెళ్లే వేతనదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు.