ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం కురిచేడుపట్నం సచివాలయం టూ పరిధి నుండి ఉదయం నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.