చిలమత్తూరు మండలంలోని టేకులోడు గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని మృతికి కారకులైన హాస్టల్ యాజమాన్యంపై అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు అన్నారు. ఇటీవల సాయిబాబా జిల్లా చిలమత్తూరు మండలంలోని టేకులోడు గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి చెందిన విషయం తెలుసుకుని ఆ పాఠశాలను ఆయన గురువారం సందర్శించి దర్యాప్తు చేపట్టారు. మీడియాతో రవిబాబు మాట్లాడుతూ. విద్యార్థిని మృతి కారకులైన ఏజీవో రాజేంద్ర కుమార్ రెడ్డి ప్రిన్సిపాల్ కరుణజ్యోతి పిఈటి రాజ్యామ్మ స్టాప్ నర్సు పద్మజ హౌస్ టీచర్ కోమలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉన్నతధికారులపై యాజమాన్యం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ ను ఆదేశించారు.