తిరుమల శ్రీవారి నిజపాదాల దర్శనాన్ని పునరుద్ధరించలేమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ దర్శనం వల్ల స్వామి వారికి నైవేద్యం ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రతి శుక్రవారం శ్రీవారి విగ్రహానికి అభిషేక నిర్వహిస్తారు. ఆ సమయంలో ఎలాంటి అలంకరణ లేకుండా గోవిందుని పవిత్ర పాదాలను ఆలయంలో 1వ ద్వారం నుంచి చూసే అవకాశం భక్తులకు కల్పిస్తారు. ఇదే నిజపాద దర్శనం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa